News January 11, 2025

కరీంనగర్: ఫుడ్ పాయిజన్.. అధికారుల SUSPEND

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

Similar News

News December 2, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.