News November 28, 2024

కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన

image

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 2, 2025

ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.

News December 2, 2025

KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 2, 2025

KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్‌ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.