News September 26, 2024

కరీంనగర్: బతుకమ్మ పండగ కానుక అందేనా!

image

పేద మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా అందించే చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో వారం రోజుల్లో బతుకమ్మ ప్రారంభం కానుండగా ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

Similar News

News December 10, 2025

KNR: పోలింగ్ కేంద్రాలకు తరలిన పోలింగ్ సిబ్బంది

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 92 గ్రామపంచాయతీలో ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో గంగాధర, రామడుగు, కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాలలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.

News December 10, 2025

KNR: తొలి విడత జీపీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మండలాల్లో డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 92 పంచాయతీల పరిధిలోని 866 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధం. నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు.

News December 10, 2025

కరీంనగర్: ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కేటాయింపు

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది SIలు, 34మంది హెడ్ కానిస్టేబుల్స్, 392మంది కానిస్టేబుళ్ళు, 47మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులని ఆయన తెలిపారు. పోలింగ్ బందోబస్తు చేసే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.