News September 21, 2024

కరీంనగర్: బాలికపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

image

KNR జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. SI తిరుపతి ప్రకారం.. మండలంలోని ఐదో తరగతి చదువుతున్న ఓ పదకొండేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈనెల 16న కేసు నమోదు చేయగా.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేశాడు.

Similar News

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.

14 మందితో ఎస్ఎఫ్ఐ నూతన గర్ల్స్ సబ్ కమిటీ ఏర్పాటు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ సబ్ కమిటీని 14 మందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈనెల 25, 26వ తేదీలలో నిజామాబాద్లో జరగబోయే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.