News March 14, 2025
కరీంనగర్: బాల్యంలో ఈ పూలతోనే హోలీ..!

కరీంనగర్ జిల్లాలో ఆ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్లుతుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 15, 2025
జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.
News March 15, 2025
భారత్కు రావొద్దని నన్ను బెదిరించారు: వరుణ్ చక్రవర్తి

2021 టీ20 వరల్డ్ కప్లో ప్రదర్శన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా ఎవరో నన్ను ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.