News March 14, 2025
కరీంనగర్: బాల్యంలో ఈ పూలతోనే హోలీ..!

కరీంనగర్ జిల్లాలో ఆ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్లుతుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 9, 2026
NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌ఓ

నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్ని మెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.


