News January 25, 2025
కరీంనగర్: బీఆర్ఎస్ను వీడొద్దు.. మేయర్‌కు కేటీఆర్ ఫోన్

బీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు బుజ్జగింపుల పర్వం మొదలైంది. సునీల్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారని సమాచారం. పార్టీని వీడవద్దని సునీల్ రావుకు కేటీఆర్ సూచించారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. బీజేపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే సునీల్ రావు ప్రకటించారు.
Similar News
News October 16, 2025
న్యూస్ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్
* TG: ఆస్ట్రేలియాలో జరిగే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ప్రసంగించనున్న మంత్రి శ్రీధర్ బాబు
* AP: పాఠశాల విద్యాశాఖలో 382 మంది ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి
* అన్ని ACB కార్యాలయాల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు రూ.52.19 లక్షల మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
News October 16, 2025
ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలి: డీఎంహెచ్‌వో

ప్రతి ఉద్యోగికి సీపీఆర్‌పై అవగాహన ఉండాలని డీఎంహెచ్‌వో గోపాలరావు అన్నారు. ములుగు కలెక్టరేట్లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. మనిషికి మానసిక ఒత్తిడి కారణంగా మెదడుకు రక్తప్రసరణ జరగక గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్నారు. అప్పుడు సీపీఆర్ ప్రక్రియ చేయాలని, దీని ద్వారా గుండె కొట్టుకోవడంతో పాటు మనిషి కోలుకోవడానికి సహాయపడుతుందన్నారు.
News October 16, 2025
ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.