News November 2, 2024

కరీంనగర్: బీసీ కమిషన్‌కు 213 విజ్ఞప్తులు

image

కరీంనగర్ కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 213 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99 విజ్ఞప్తులు రాగా జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 53 విజ్ఞప్తులు వచ్చాయి. సుమారు 9 గంటల పాటు బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తులను స్వీకరించారు.

Similar News

News December 6, 2024

రాజన్నను దర్శించుకున్న 26,928 మంది భక్తులు 

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం 26,928 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కలు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News December 6, 2024

సిరిసిల్ల: అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్

image

హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల మేరకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.

News December 6, 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

image

KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.