News February 12, 2025
కరీంనగర్: బీసీ స్టడీ సర్కిల్లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ కోసం 539 మంది దరఖాస్తు చేసుకున్నారని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ వరకు స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. 15 నుంచి తరగతులు ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..
Similar News
News December 9, 2025
చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు
News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
News December 8, 2025
KNR: స్విమ్మింగ్లో బ్రాంజ్ మెడల్తో మెరిసిన స్వరణ్

ఆదిలాబాద్ వేదికగా జరుగుతున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్విమ్మర్ కంకణాల స్వరణ్ సత్తా చాటాడు. గ్రూప్-1 కేటగిరీలో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వరణ్ను క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణమూర్తితో పాటు కోచ్లు ఘనంగా అభినందించారు.


