News February 24, 2025
కరీంనగర్: బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News February 24, 2025
కరీంనగర్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
News February 24, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా…

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.5°C నమోదు కాగా, జమ్మికుంట 37.8, మల్యాల, ఈదులగట్టేపల్లి 37.7, నుస్తులాపూర్ 36.8, గంగిపల్లి, పోచంపల్లి 36.3, కొత్తపల్లి-ధర్మారం 35.6, వీణవంక 35.4, గట్టుదుద్దెనపల్లె 35.3, గంగాధర 35.1, ఇందుర్తి 35.0, కరీంనగర్ 34.9, తాడికల్ 34.7, వెదురుగట్టు 34.6, గుండి 34.4°C గా నమోదైంది.
News February 24, 2025
చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.