News March 2, 2025
కరీంనగర్: భద్రతా నియమాలు పాటించాలి

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో లెక్కింపునకు వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, క్లరికల్ సిబ్బంది, పాత్రికేయులు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఏసిపి యాదగిరిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ స్టేడియం గేట్ నంబర్-1 ద్వారా మాత్రమే లోపలికి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసుకుని, గేట్ నంబర్ -4 ద్వారా ఇండోర్ స్టేడియంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

భీమవరంలో రూ.25 లక్షల విరాళం

భీమవరంలో నిర్మిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల భవన నిర్మాణానికి దాతలు సహకరించడం అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఆనంద ఫౌండేషన్ రూ.25 లక్షలను భవన నిర్మాణానికి ప్రకటించింది. వారి కార్యాలయంలో రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడికి అందజేశారు. మిగిలిన వాటిని త్వరలో అందిస్తామన్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.