News March 24, 2024
కరీంనగర్: భారీగా పెరగనున్న ఎండలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని అన్నారు. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని అధికారులు తెలయజేశారు.
Similar News
News October 31, 2024
రాజన్నను దర్శించుకున్న 17,815 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి గురువారం దీపావళి సందర్భంగా 17,815 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కె.వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
News October 31, 2024
కొండగట్టు దేవస్థానంలో దీపావళి వేడుకలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండగట్టు ఆంజనేయ దేవస్థానంలో గురువారం దీపావళి వేడుకలు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో దీపకాంతులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2024
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు
దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలోని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ అనంతనాగేంద్ర స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల ప్రత్యేక అలంకరణ మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.