News July 21, 2024
కరీంనగర్: భారీ వర్షం.. ఈ నంబర్‌కి కాల్ చేయండి

భారీ వర్షం కారణంగా కరీంనగర్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బల్దియా అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వరద నీరు నిలవకుండా రెస్క్యూ టీం సభ్యులు పనిచేస్తారు. భారీ గుంతలు ఏర్పడితే తాత్కాలికంగా మట్టితో పూడ్చివేస్తారు. అత్యవసర సేవలకైన 98499 06694 నంబర్ కాల్ చేయలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.
News November 12, 2025
కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖడే

కరీంనగర్ జిల్లా నూతన విద్యాధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖడేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె విద్యాధికారిగా కొనసాగనున్నారు.


