News July 14, 2024
కరీంనగర్: మంత్రి పొన్నం రేపటి పర్యటన వివరాలు..

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని తన వ్యక్తి గత సహాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించనున్న 75వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే పూరీ జగన్నాథ స్వామి రథయాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
News December 9, 2025
చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు
News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.


