News March 25, 2024

కరీంనగర్: మత్తుకు బానిస!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఉన్నత చదువులు చదివి కన్నవారి కలలు నెరవేర్చాల్సిన పిల్లలు వ్యసనాలకు బానిసై బంగారు భవితను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను గమనించి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జగిత్యాలలో బాలికలకు ఓ ముఠా మత్తు మందు ఇచ్చి రేవ్‌ పార్టీలకు తీసుకెళ్తోందనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Similar News

News January 15, 2025

అంబరాన్నంటిన కొత్తకొండ జాతర

image

ఉమ్మడి కరీంనగర్ జల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల మండల ప్రజలు ఎడ్లబండ్ల రథాలతో కొత్తకొండకు వచ్చారు. వీరభద్రస్వామికి కోరమీసాలు, కోడెమొక్కులు, గుమ్మడికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శరభ శరభ స్లోగన్స్‌తో మారుమోగింది.

News January 15, 2025

విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం

image

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

News January 14, 2025

GDK: ఇలాగైతే ప్రమాదాలు జరగవా!

image

గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రోడ్డుపై ఓ పక్క రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల రోడ్డుపై గుంత ఏర్పడి, క్రమక్రమంగా అది పెద్దగా అవుతుండటంతో గుర్తించేందుకు వీలుగా స్థానికులు దానికో గుడ్డ పీలిక చుట్టారు. ఇదంతా అధికారులు చూస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.