News August 21, 2024

కరీంనగర్: మళ్లీ IASకే కమిషనర్ బాధ్యతలు!

image

కరీంనగర్ <<13902837>>కార్పొరేషన్‌ కొత్త కమిషనర్‌<<>>గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌ని నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. 2019 IAS బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌ IIT కాన్పూరులో బీటెక్ పూర్తి చేశారు. ఈమె APతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ITDA ప్రాజెక్టు డైరెక్టర్‌గా, సబ్‌ కలెక్టర్‌గా, అదనపు కలెక్టర్‌గా పని చేశారు. కాగా రెండేళ్ల తర్వాత మళ్లీ IASకే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.

Similar News

News February 11, 2025

పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

image

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్‌, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.

News February 11, 2025

కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి

image

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

News February 11, 2025

రేపే మేడారం జాతర..!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.

error: Content is protected !!