News January 6, 2025
కరీంనగర్: మానసాదేవి టెంపుల్.. చాలా స్పెషల్!
KNR జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలోని 800ఏళ్లనాటి మానసాదేవి మహాక్షేత్రం ప్రత్యేకమైనది. దేశంలో వెలసిన 2 స్వయంభు ఆలయాల్లో మొదటిది హరిద్వార్లో ఉండగా.. రెండోది మన జిల్లాలోనే ఉండటం విశేషం. అమ్మవారు కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారితో పాటు దాదాపు 108 నాగదేవతల విగ్రహాలు ఉన్నాయట. గత ఆరేళ్లలో సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట ఘటన బాధాకరం: శ్రీధర్ బాబు
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు.
News January 9, 2025
తిరుమలలో తొక్కిసలాట అత్యంత బాధాకరం: KNR MLA
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ X ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకర విషయం అన్నారు.
News January 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.70,412 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,348, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,890, అన్నదానం రూ.12,174 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.