News January 28, 2025

కరీంనగర్: మా సమస్యను తీర్చండి.. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలు సమస్యల్ని KNR కలెక్టర్‌కు విన్నవించారు. HZBకు చెందిన వీరగోని రవళి భర్త చనిపోగా.. తన ఇంటిని అత్త, మామ, ఆడపడుచులు అమ్మారని పేర్కొంది. రోడ్డు విస్తరణ పేరుతో నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారని తీగలగుట్టపల్లికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఇరుకుల్లకు గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Similar News

News December 15, 2025

హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

image

​KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.

News December 14, 2025

ముంజంపెల్లి: ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపు

image

మానకొండూర్ మండలం ముంజంపెల్లి సర్పంచ్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. నందగిరి కనక లక్ష్మి (INC) ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. తొలి లెక్కింపులో ఆమెకు 878 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి వెలుపు గొండ కొమురమ్మ (BRS)కు 877 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా కనక లక్ష్మికే 1 ఓటు ఆధిక్యం రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.