News February 11, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
Similar News
News December 22, 2025
KNR: పత్తి రైతుకు మళ్లీ ‘ధర దెబ్బ’..!

కరీంనగర్ జిల్లాలో పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ.50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ.50 తగ్గించగా, తాజాగా మరో రూ.50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010 కి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 21, 2025
ఈనెల 24 నుంచి ‘కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా’

కరీంనగర్లో ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 21, 2025
ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

ఉమడి KNR జిల్లా స్థాయి మైనారిటీ బాలికల పాఠశాలల & కళాశాలల క్రీడా పోటీలు KNR జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల చొప్పదండి బాలికలు -1, గంగాధర కైవసం చేసుకుంది. ఈ పోటీలకు వివిధ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.


