News February 11, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
Similar News
News December 8, 2025
నిజామాబాద్: సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల తంటాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సర్పంచి స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News December 8, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
ఖమ్మం: పల్లె రాజకీయాల్లో మాటల సెగలు

మూడు దశల పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించగా, ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతుండటంతో చలికాలంలోనూ రాజకీయ వాతావరణం సెగలు కక్కుతోంది. కార్యకర్తలను గెలిపించుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.


