News October 14, 2024

కరీంనగర్: ముమ్మరంగా రేషన్ కార్డుల సవరణ!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రేషన్ కార్డులలో లోపాలను సవరిస్తున్నారు. అనర్హులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరణించినవారు, వివాహమై అత్తింటికి వెళ్లిన మహిళలు తదితరులను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 9 నెలల వ్యవధిలోనే 1,186 రేషన్ కార్డులను రద్దు చేసి 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు.

Similar News

News December 9, 2025

కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

image

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.

News December 9, 2025

మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 9, 2025

KNR: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. మెదడి విడతలో 5 మండలాలు గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్‌లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. మొత్తం 92 పంచాయతీలకు గాను మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.