News March 12, 2025
కరీంనగర్: మూడురోజులు ఫ్లెక్సీ షాపులు బంద్

కరీంనగర్లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడురోజుల బంద్కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్పోర్ట్ ధరలు అధికంగా పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేక సతమతమవుతున్నామన్నారు. సభ్యులందరూ కలిసి ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News November 8, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం 10వ శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ కైలాస గిరి బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 11న ఉ.5 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి NOV 13న KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 అన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.
News November 7, 2025
KNR: సహకార అధికారి కార్యాలయంలో ‘వందేమాతరం’

వందేమాతరం గీతానికి 150వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య మాట్లాడుతూ.. వందేమాతరం గీతం మన దేశ స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణగా నిలిచిందని, దేశభక్తి భావాలను పెంపొందించే శక్తి ఈ గీతంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 7, 2025
కరీంనగర్ కలెక్టరేట్లో ‘వందేమాతరం’ గీతాలాపన

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


