News March 12, 2025
కరీంనగర్: మూడురోజులు ఫ్లెక్సీ షాపులు బంద్

కరీంనగర్‌లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడురోజుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్‌పోర్ట్ ధరలు అధికంగా పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేక సతమతమవుతున్నామన్నారు. సభ్యులందరూ కలిసి ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News March 23, 2025
గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.
News March 23, 2025
కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.