News January 25, 2025

కరీంనగర్: మేయర్ సునీల్‌రావు రాజీనామాతో జిల్లా బీఆర్ఎస్ అలర్ట్

image

మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్‌కి రాజీనామా చేసిన ప్రకటనతో కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సునీల్ రావుతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లొద్దని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి సూచించినట్లు సమాచారం.

Similar News

News November 8, 2025

ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు!

image

TG: రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది. ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్‌స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 8, 2025

పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

image

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

News November 8, 2025

NLG: పలువురు జడ్జీలకు స్థానచలనం

image

ఉమ్మడి నల్గొండలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. NLG జిల్లా కోర్టు 3వ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ నిజామాబాద్‌కు, MLG కోర్టు 5వ అదనపు జడ్జి జి.వేణు సికింద్రాబాద్‌కు, సీనియర్ సివిల్ జడ్జి బి.సుజయ్ HYD కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న కెవి.చంద్రశేఖరరావు MLG కోర్టుకు, HZNR కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం.రాధాకృష్ణ చౌహన్ SRPT కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు.