News July 29, 2024
కరీంనగర్: మొదలైన ఎన్నికల సందడి !

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీ కాలం పూర్తయి 6 నెలలు అవుతోంది. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం ఈనెల 4తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,218 పంచాయతీలతో పాటు 64 మండలాల్లో ఎన్నికల టాపిక్ నడుస్తోంది.
Similar News
News December 18, 2025
కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వోకు ఆశా వర్కర్ల వినతి

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.
News December 18, 2025
జమ్మికుంట మార్కెట్కు మూడు రోజులు సెలవు

జమ్మికుంట మార్కెట్కు శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారల్లో సాధారణ సెలవు ఉంటుందని తిరిగి మార్కెట్ సోమవారం ప్రారంభం అవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. గురువారం మార్కెట్కు రైతులు 19 వాహనాల్లో 144 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,450, కనిష్ఠంగా రూ.6,800 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.100 పెరిగింది.
News December 18, 2025
KNR: ఎన్నికల పరిశీలకులకు అభినందనలు: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల పరిశీలకులు వి. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఎన్నికల విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి ఫలితమే విజయవంతమైన ఎన్నికల నిర్వహణ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారు.


