News July 30, 2024

కరీంనగర్: మొదలైన పంచాయతీ ఎన్నికల కసరత్తు

image

CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి KNR జిల్లాకు వచ్చే నెల 2న వార్డుల మ్యాపింగ్, ఓటరు జాబితా తయారీపై కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జగిత్యాలలో 380, పెద్దపల్లి 265, KNR 313, సిరిసిల్ల 255.. ఉమ్మడి జిల్లాలోని 1,213 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లు శిక్షణలో పాల్గొననున్నారు.

Similar News

News October 28, 2025

KNR: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ పమెల సత్పతి ఆధ్వర్యంలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23 వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.

News October 27, 2025

KNR: ఎస్‌యూ స్నాతకోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

image

శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ) ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, నవంబర్ 7న జరగనున్న రెండవ స్నాతకోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అందజేశారు. స్నాతకోత్సవ ఏర్పాట్ల పనులు దాదాపు పూర్తవుతున్నాయని ఆయన గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.

News October 27, 2025

కరీంనగర్‌: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

image

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.