News March 9, 2025

కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.

Similar News

News October 17, 2025

KNR: తీవ్ర ఉద్రిక్తత నడుమ అభిప్రాయాల సేకరణ

image

KNR జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే గురువారం ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అభిప్రాయాల సేకరణ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లి పరిశీలకులకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

News October 16, 2025

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్‌కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News October 16, 2025

KNR: 30లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరణే లక్ష్యం

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.