News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
Similar News
News December 4, 2025
తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.
News December 4, 2025
MHBD: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: SP

తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరిష్ సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిసార్లు పొగ మంచు ఎక్కువగా ఉంటే వాహనాలు ఆపాలన్నారు. నిర్దిష్ట స్పీడ్‌తో వాహనాలను నడపడం వల్ల స్లిప్పరీ రోడ్ల నుంచి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చన్నారు.
News December 4, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1921, కనిష్ఠ ధర రూ.1731; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2051, కనిష్ఠ ధర రూ.1700; వరి ధాన్యం (HMT) ధర రూ.2301; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3025, కనిష్ఠ ధర రూ.2100గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


