News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
Similar News
News March 24, 2025
ఈనెల 26న విజయవాడ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 26న విజయవాడకు రానున్నారు. YSRCP ఆధ్వర్యంలో ఈనెల 26న నగరంలోని NAC కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ హాజరవుతారని ఎన్టీఆర్ జిల్లా YSRCP పార్టీ ప్రెసిడెంట్ దేవినేని అవినాశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతో చర్చించామని ఆయన తెలిపారు.
News March 24, 2025
తిరువూరు: రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి.. కారణమిదే.!

తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సరస్వతి(70), కుమారుడు కృష్ణ(53)ను ఆదివారం ఓ లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఇంత ఘోర ప్రమాదం జరిగినా లారీలు మాత్రం జనసంచారం ఉన్న ప్రదేశాల్లో హైస్పీడ్‌లో వెళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి లారీలు హైస్పీడ్‌లో వెళ్లకుండా కంట్రోల్ చేయాలని స్థానికులు, వాహనదారులు అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
News March 24, 2025
అమరావతిలో 250 ఎకరాల్లో ప్రధాని సభ!

AP: రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు PM మోదీ వచ్చే నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైనా పీఎంవో తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది.