News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: విషాదం.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

భూపాలపల్లి(D) గణపురం(M) బుద్ధారంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్(D) ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక(23)కు రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

గుంటూరు సౌత్ డివిజన్‌లో ప్రమాద ప్రాంతాల పరిశీలన

గుంటూరు సౌత్ సబ్-డివిజన్ డీఎస్పీ భానోదయ 12 ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) నల్లపాడు, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పరిశీలించారు. లైటింగ్, హెచ్చరిక బోర్డులు, సీసీటీవీలు, వేగ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. పరిశీలన ఆధారంగా ప్రత్యేక రిపోర్టును ఎస్పీ వకుల్ జిందాల్, NHAIకు పంపనున్నట్లు తెలిపారు. ఎంవీఐ మల్లేశ్వరి, NHAI ఇంజినీర్ దత్తాత్రేయ, సీఐలు వంశీధర్, శ్రీనివాసరావు ఉన్నారు.