News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
Similar News
News December 7, 2025
పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
News December 7, 2025
ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు సమర్పించండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. మండల, డివిజనల్ మున్సిపల్ కార్యాలయాల్లోనూ https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదుల సమర్పించవచ్చన్నారు.
News December 7, 2025
పాడేరు: ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.


