News March 25, 2024
కరీంనగర్: యువతిపై అత్యాచారం

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన HYD KPHBలో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించిKPHBలో ఆన్లైన్ శిక్షణకు చేరింది. ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు.దీంతో ఆమె KNRలోని ఆమె ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. నరేందర్, సంతోశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News December 27, 2025
KNR: ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమ పోస్టర్‌ను కరీంనగర్లో శనివారం ఆవిష్కరించారు. మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News December 27, 2025
KNR: మహిళలపై ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మహిళలపై 567 కేసులు నమోదయ్యాయి. ఇందులో వరకట్న హత్యలు, మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అత్యాచారం, అపహరణ, లైంగిక వేధింపులు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. 2024లో 598 కేసులు నమోదు కాగా గత సంవత్సరం కంటే 5.18% మహిళల కేసులు తగ్గాయని సీపీ గౌస్ ఆలం తెలిపారు.
News December 27, 2025
కరీంనగర్: ప్రాపర్టీ కేసుల్లో 50% ఛేదించారు..!

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో ప్రాపర్టీ కేసులు 505 నమోదయ్యాయి. ఇందులో 251 కేసులను పోలీసులు ఛేదించారు. 2025లో నష్టపోయిన ఆస్తి విలువ రూ. 4,11,98,269/-, ఇందులో రూ. 2,04,40,762/- విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందించారు. దీనితో రికవరీ శాతం 49.62%గా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి రికవరీలో 24% పెరిగింది.


