News September 27, 2024
కరీంనగర్: రుణమాఫీపై రైతుల ఆందోళన!
కరీంనగర్ జిల్లాలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.2 లక్షల లోపు రుణం తీసుకొని పలు కారణాలతో మాఫీ కాని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా అర్హులను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో భాగంగా ఇప్పటివరకు 12 వేలకు పైగా రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణ పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.
Similar News
News October 11, 2024
పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది: ఆది శ్రీనివాస్
పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల మానేరు వాగు తీరంలో గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు – 2024 పేరిట చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.
News October 10, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు.
News October 10, 2024
సిరిసిల్ల: సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో బతుకమ్మ
సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి సద్దు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చి సోషల్ మీడియాలో చిత్రాలు అప్లోడ్ చేశారు. నెటిజన్లను ఈ బతుకమ్మ ఎంతగానో ఆకర్షిస్తోంది.