News August 31, 2024

కరీంనగర్: రూ.2.75 కోట్ల సొమ్ము రికవరీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. దీంతో పోలీసులు విలువైన సమాచారాన్ని అందించారు. నష్టం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేసినా (డైమండ్ అవర్), నిమిషంలోపు ఫిర్యాదు చేసినా (గోల్డెన్ అవర్) సంబంధిత సొమ్మును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.2.75 కోట్లు రికవరీ చేశారు. గంటలోపే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించి రూ.7,550 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ సిబ్బంది, DCMS సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

News February 18, 2025

కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

రానున్న పదో తరగతి పరీక్షలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధతపై మంగళవారం మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం పదో తరగతి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు.

News February 18, 2025

NTPCలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

image

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 400అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

error: Content is protected !!