News September 16, 2024

కరీంనగర్: రూ.5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం

image

70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Similar News

News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న కరీంనగర్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు కరీంనగర్ ముస్తాబైంది. మానేరు తీరం, చింతకుంట, SRR డిగ్రీ కాలేజీ, టవర్ సర్కిల్, రేకుర్తి సమ్మక్కల గద్ద అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన మైదానాల్లో ఆడనున్నారు. రేపు బతుకమ్మ పాటలతో కరీంనగర్ హోరెత్తనుంది.

News October 9, 2024

కరీంనగర్: తమ్ముడిని హత్య చేసిన అన్న

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల కుమారస్వామి, కుందేళ్ల చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అన్న కుమారస్వామి తమ్ముడైన చంద్రుని ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం కుమారస్వామి స్టేషన్‌లో లొంగిపోయాడు.

News October 9, 2024

తంగళ్లపల్లి: మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన యువకుడు

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకి చెందిన దాసరి ప్రశాంత్ 2020లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాబ్ సాధించాడు. విధులు నిర్వహిస్తూనే రైల్వే గ్రూప్ డీ, ఎస్జీటీ టీచర్, TGPSC గ్రూప్4 మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు. సొంత నోట్స్, రోజు ప్రిపరేషన్ వల్ల తను సక్సెస్ కాగలిగానని ప్రశాంత్ తెలిపాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన ప్రశాంత్‌ను పలువురు గ్రామస్థులు అభినందించారు.