News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News December 21, 2025

కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.

News December 21, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* వడియాల పిండిలో కాస్త నిమ్మరసం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి.
* కూరగాయలు ఉడికించాక రంగు పోకుండా ఉండాలంటే నీళ్లలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ ఆయిల్ వెయ్యాలి.
* నిల్వ పచ్చళ్లు భద్రపరిచే ముందు ఆ డబ్బాలో కాస్తంత ఇంగువ కాల్చి, వెయ్యాలి.
* చేప ముక్కల్ని నిల్వ చెయ్యాలంటే వాటికి కాస్త ఉప్పు రాసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. దానివల్ల ముక్కలు మంచు పేరుకుపోకుండా, తాజాగా ఉంటాయి.

News December 21, 2025

పల్నాడులో పాడి సిరి.. లీటరు రూ. 100

image

పల్నాడు జిల్లాలో పాడి పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతోంది. స్వచ్ఛమైన పాలకు గిరాకీ పెరగడంతో పశువుల పెంపకం రైతులకు లాభసాటి ఆదాయ మార్గంగా మారింది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులు చిక్కటి గేదె పాలను లీటరు రూ.100 వరకు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగుకు తోడుగా పాడిని పెంచుకుంటూ రైతులు నెలకు ఆశించిన స్థాయిలో ఆదాయం పొందుతున్నారు.