News April 28, 2024
కరీంనగర్: రేపు మధ్యాహ్నం 3వరకు గడువు

ఎంపీ నామినేషన్ల ఉపసంహరణకు రేపటితో చివరి గడువు అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణీత నమూనా 5లో కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు. 3గంటల తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News October 19, 2025
KNR: దీపావళి.. ఈ నంబర్లు SAVE చేసుకోండి..!

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.
News October 19, 2025
KNR: ‘పెద్దల సమక్షంలోనే క్రాకర్స్ పేల్చాలి’

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కరీంనగర్ డీసీసీ చీఫ్ ఎంపిక.. రేసులో సత్యప్రసన్న!

KNR DCC అధ్యక్ష పదవి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ పదవి కోసం శనివారం జరిగిన ఇంటర్వ్యూలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక MLA, AICC ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మన్నె ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన తన ప్రణాళికలు, అభిప్రాయాలను ఆమె వివరించారు. జిల్లా స్థాయిలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు.