News August 25, 2024
కరీంనగర్: రేపు మాంసం దుకాణాలు బంద్
ఈ నెల 26న కృష్ణాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయనున్నట్లు కరీంనగర్ నగరపాలక సహాయ కమిషనర్ వేణుమాధవ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల మాంసం దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఎవరైనా మాంసం విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News September 16, 2024
తిమ్మాపూర్: వలకు చిక్కిన 28 కిలోల చేప
తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూడా తిరుపతికి కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగులో (ఎల్ఎండి మానేరు డ్యామ్)లో 28 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. చేపల వేటలో భాగంగా సోమవారం మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో తిరుపతి అనే మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. గణపతి నిమజ్జనం రోజున ఈ వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభసూచకమని అతను ఆనందం వ్యక్తం చేశాడు.
News September 16, 2024
కువైట్‌లో జగిత్యాల వాసి మృతి
జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
News September 16, 2024
KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు
నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.