News February 7, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి

కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 3, 2025
పసలపూడి వాసికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు

ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన యువర్స్ బిసర్వేంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు చీపుళ్ళ విజయ్కు ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాల్లో అందించే సేవలకు ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో అవార్డులు అందిస్తారు. విజయ్ తన ఆర్గనైజేషన్ ద్వారా 50వేల మందికిపైగా బ్లడ్, లక్ష మందికి పైగా ఆహారం, వీల్ ఛైర్స్ అందజేత కార్యక్రమాలకు గానూ.. న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నారు.
News December 3, 2025
స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దు: DMHO

ఎన్టీఆర్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని DMHO సుహాసిని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, కుట్టిన చోట ఎర్రటి మచ్చ కనిపిస్తుందని వివరించారు. పొలాలు, తోటలకు వెళ్లేటప్పుడు పొడవు చేతుల బట్టలు ధరించాలని ఆమె సూచించారు.
News December 3, 2025
‘అఖండ-3’ ఉందని హింట్ ఇచ్చిన తమన్?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈనెల 5న విడుదలవనుంది. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఫైనల్ ఔట్పుట్ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎండ్ కార్డ్ ఫొటోను Xలో పంచుకున్నారు. అందులో ‘జై అఖండ’ అని ఉండటంతో ఇది పార్ట్-3 టైటిల్ అనే చర్చ మొదలైంది. ‘అఖండ-2’ ముగింపులో సీక్వెల్ కొనసాగింపుపై డైరెక్టర్ లీడ్ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.


