News February 7, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి

కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్‌పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
Similar News
News March 14, 2026
నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News March 14, 2026
దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 14, 2026
అల్లూరి: ఓపెన్ టెన్త్‌కు 15 సెంటర్స్

ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పరీక్షల కమిషనర్ శశికుమార్ శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో 15 కేంద్రాల్లో 1,417మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 1,003, పోలవరం జిల్లా నుంచి 414 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. ఆరు సబ్జెక్ట్‌లో పరీక్షలు ఈ నెల 27వరకు జరుగుతాయి. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.


