News September 28, 2024

కరీంనగర్: రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: కలెక్టర్

image

భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పైపులైన్లు, కల్వర్టులకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, ఎన్పీడీసీఎల్ తదితరశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 8 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.

Similar News

News July 11, 2025

KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

image

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News July 11, 2025

తిమ్మాపూర్: ‘కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’

image

బెజ్జంకికి చెందిన కోటారి భానుప్రసాద్(19), నరేష్‌తో కలిసి బైక్‌పై కరీంనగర్‌ వెళ్లి తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజామున <<17014948>>రేణికుంటలో<<>> రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయిబాబా గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై భాను ప్రసాద్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

KNR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది: USFI

image

KNR జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని USFI (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు USFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు DIEOకి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. అక్రమంగా నడుస్తున్న ఈ కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.