News April 27, 2024
కరీంనగర్: వచ్చే 5 రోజులు జాగ్రత్త
వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీస్తాయని, ఉ. 11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది.
Similar News
News January 10, 2025
KNR: సీఎంకు బండి సంజయ్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
News January 10, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజామునే గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ వీపీ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఆలయ ఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
News January 10, 2025
కాల్వ శ్రీరాంపూర్: ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన సింధుజ
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీల్ ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన బంగారి సింధుజ సత్తా చాటింది. గతేడాది జులైలో రాత పరీక్ష జరగగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో భాగంగా బంగారి సింధుజ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.