News December 16, 2024

కరీంనగర్: వణుకు పుట్టిస్తున్న చలి!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. చలి ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని గంభీరావుపేటలో 8.6, జూలపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు, యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News January 13, 2025

సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్

image

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

News January 13, 2025

ఒకే వేదికపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు

image

నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.

News January 13, 2025

KNR: పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. వీటిని ఎందుకు పోస్తారో తెలుసా..? రేగు పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు. వీటికి అర్కఫలం అనే పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. వీటిని ఐదేళ్ల లోపు పిల్లల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.