News March 22, 2025
కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ LMD జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని <<15824324>>మగ<<>> మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.
Similar News
News April 22, 2025
RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.
News April 22, 2025
NGKL: BRS వాళ్లు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వంపై BRS వాళ్లు విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి హితవు పలికారు. NGKL వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొని ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు పాల్గొన్నారు.
News April 22, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్