News October 17, 2024
కరీంనగర్: వినూత్నంగా యువ నాయకుడి మేనిఫెస్టో!

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు మేనిఫెస్టోను యువ నాయకుడు మద్దుల ప్రశాంత పటేల్ విడుదల చేశారు. తనను గెలిపిస్తే 10 తరాలు గుర్తుండిపోయేలా చేస్తానంటూ ముందస్తుగా విడుదల చేసి నాయకులు ఆలోచింపజేసే విధంగా చేశారు. ప్రతి నెల హెల్త్ క్యాంప్, ఆడ పిల్ల పెళ్లి కానుక, మూతబడిన పాఠశాల రీ-ఓపెన్, ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ తదితర హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
Similar News
News November 10, 2025
కరీంనగర్: సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News November 9, 2025
KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.


