News February 10, 2025
కరీంనగర్: వైభవంగా 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్డులోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తా వర్ణములు, ధ్వజారోహణ, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహించారు.
Similar News
News March 20, 2025
బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.
News March 20, 2025
KNR: విద్యార్థి దశలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాస్థాయి యువజన ఉత్సవం కార్యక్రమం తిమ్మాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలో స్వేచ్ఛ, అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ దశలోనే చదువుతోపాటు సమాజసేవను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందించడం కూడా ముఖ్యమైన్నారు.
News March 20, 2025
పన్ను వసూళ్ళలో హుజూరాబాద్‌కు మొదటిస్థానం

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.