News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2025
కొత్తకొండ వీరభద్రస్వామి జాతర తేదీలు ఇవే

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
News December 24, 2025
KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
News December 23, 2025
కరీంనగర్: బాలసదనంలో వసతుల పరిశీలన

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనం, శిశుగృహ సంరక్షణ కేంద్రాలను జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. పిల్లలకు అందుతున్న భోజన, విద్యా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్ అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. చిన్నారుల సంరక్షణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సూచించారు. జిల్లా న్యాయ సేవా సాధికారత విభాగం సూపరింటెండెంట్ సుజాత ఉన్నారు.


