News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

image

ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగగా బాధితుడికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన కొమురయ్య, అదే గ్రామానికి చెందిన రవి మధ్యలో భూతగాదాలతో గొడవ జరగగా వారిని ఆపేందుకు వెళ్లిన బత్తిని సాగర్‌పై రవి కొడవలితో దాడి చేశాడు. సాగర్‌కు తీవ్ర గాయాలవగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 13, 2025

MNCL: వరకట్న వేధింపులు.. ఇద్దరిపై కేసు: CI

image

వరకట్న వేధింపుల కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో హమాలివాడకు చెందిన ముత్యాల స్వాతికి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కాగజ్‌నగర్‌కు చెందిన రాంప్రసాద్‌తో 2011 మార్చి 24న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు ఆడపడుచు సరోజ వేధించడంతో స్వాతి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 13, 2025

వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు 

image

జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్లగా ఉద్యోగాలు వచ్చాయి. అందులో జిల్లాకు చెందిన హరిత రాణి, పద్మజ, సానియా సుల్తానా, భార్గవి, రాజు నాయక్, కమల్ రాజ్, అనంతయ్య ఉన్నారు.  

News March 13, 2025

వికారాబాద్: నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: డీపీవో

image

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వంద శాతం ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి, డాక్టర్ జయసుధ సూచించారు. ఆమె ధారూర్ మండలంలో గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. చింతకుంట, కెరెల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

error: Content is protected !!