News February 18, 2025

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించి రూ.7,550 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ సిబ్బంది, DCMS సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

Similar News

News November 30, 2025

కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.

News November 30, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్‌లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 30, 2025

KNR: ‘ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోండి’

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారిణి కే.సంగీత తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా e-passలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలని ఆమె సూచించారు.