News December 20, 2024
కరీంనగర్ శిశుగృహ నుంచి శిశువు దత్తత

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న నాలుగు నెలల మగ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా వరంగల్‌కు చెందిన పిల్లలు లేని దంపతులకు శుక్రవారం దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.
News October 22, 2025
కరీంనగర్: రేపే లాస్ట్ డేట్.. 27న డ్రా

కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అని, రూ.3 లక్షల రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస రావు తెలిపారు. నిన్నటి వరకు 2,639 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు అప్లికేషన్స్ సమర్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను ఈనెల 27న నిర్వహించే లాటరీ ద్వారా దక్కించుకోవాలని సూచించారు.
News October 22, 2025
APK ఫైల్స్ ఓపెన్ చేసి ఇన్ స్టాల్ చేస్తే ఇలా చేయండి: సీపీ

ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్‌ను క్లిక్ చేసి లేదా ఇన్స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.
1. వెంటనే మీ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌కు మార్చండి.
2. అనుమానాస్పద APK ఫైల్‌ను అన్ఇన్స్టాల్ చేయండి/తొలగించండి.
3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుండి ##002# డయల్ చేయండి.
4. 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయండి.